
431views
న్యూఢిల్లీ: బాల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం-2022కు ఎంపిక అయ్యారు. ఈ ఏడాది 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. పత్తిపాక మోహన్ రాసిన ‘బాలలతాత బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కింది. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సహాయ సంపాదకులు, కవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోహన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించారు.

Source: EtvBharat





