News

సంజయ్ యాత్రకు అనుమతికై డీజీపీని ఆదేశించండి

327views
  • గ‌వ‌ర్న‌ర్‌కు బీజేపీ నేత‌ల విన‌తి ప‌త్రం

భాగ్య‌న‌గ‌రం: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డాక్ట‌ర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ తెలంగాణ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్ట‌ర్‌ కె లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వెంకటస్వామి, విజయశాంతి, ఈటెల రాజేందర్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహనరావు, మాజీ ఎమ్యెల్సీ ఎన్‌. రామచంద్రరావులతో కూడిన ప్రతినిధి వర్గం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు జరిపిన దాడిపై విచారణ జరిపించాలని కోరారు. మంగళవారం జనగాంలో ప్రజా సంగ్రామ యాత్రపై దాడికి కుట్ర పన్నిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఘటనపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి