
440views
-
రాధాకృష్ణుల అభ్యంతరకర ఫోటోలు షేరింగ్
-
అమెజాన్‌ను బ్యాన్ చేయాలంటూ ఆందోళన
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి చిక్కుల్లో పడింది. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అభ్యంతర కరమైన ఫోటోను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియాలో బాయకాట్ అమెజాన్ హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు… ఈ వ్యవహారంలో వెంటనే క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పవిత్రమైన రాధాకృష్ణుల బంధాన్ని, ప్రేమను అవమానించింది. అసలు ఇలాంటి అసభ్య చిత్రాలను విక్రయించే ధైర్యం అమెజాన్ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ‘షేమ్ ఆన్ యూ’ అంటూ మండిపడుతున్నారు. ఇందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అమెజాన్‌పై సోషల్ మీడియా యూజర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఎక్సోటిక్ ఇండియాపై ఇవే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా ట్విటర్‌లో #Boycott_Amazon #Boycott_ExoticIndia జోరు కొనసాగుతోంది.