News

కిడ్నాపింగ్ కేసులో లొంగిపోవాల్సిన వ్యక్తి బీహార్‌లో న్యాయశాఖ మంత్రి

371views

బీహార్‌: అపహరణ కేసులో లొంగిపోవాల్సిన వ్యక్తి న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం బీహార్‌లో వివాదానికి తెరలేపింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం తన మంత్రివర్గంలోకి 31 మందిని తీసుకున్నారు. ఇందులో 16 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్జేడీ ఎమ్మెల్సీ కార్తికేయ సింగ్‌ న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఈ వివాదం తలెత్తింది.

కిడ్నాపింగ్ కేసులో కార్తికేయ సింగ్ సింగ్ ఈనెల 16న దనపూర్ కోర్టులో లొంగిపోవాల్సి ఉండగా, ఆయన నేరుగా పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకుని మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, కళంకిత మంత్రిని క్యాబినెట్‌లోకి తీసుకోవడం నితీష్‌ను ఇరకాటంలోకి నెట్టింది. ”నాకు తెలియదు. దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర లేదు” అని క్లుప్తంగా ఆయన సమాధానమిచ్చారు.

కార్తికేయ సింగ్, మరో 17 మందిపై 2014లో పట్నాలోని బిహ్టా పోలీస్ స్టేషన్‌లో అపహరణ కేసు నమోదైంది. ఒక బిల్టర్‌ను హత్య చేసే ఉద్దేశంతో అతని కిడ్నాప్‌కు కుట్ర పన్నినట్టు కార్తికేయ సింగ్‌పై ఆరోపణ ఉంది. ఈ కేసులో ఆయనపై చార్జిషీటు కూడా నమోదైంది. ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అభియోగాలున్నాయి. 2017 ఫిబ్రవరి 16న ఆయన పాట్నా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి