News

పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

231views

* కుట్ర వెనుక పాకిస్తాన్ హస్తం

పంజాబ్‌లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్ ‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు పిస్టోళ్లు, 40 క్యాట్రిడ్జ్ ‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ‌ను పంజాబ్-ఢిల్లీ పోలీసులు సంయక్తంగా నిర్వహించారు.

“స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ పంజాబ్‌ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాం. పాకిస్థాన్ ‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతు కలిగిన నలుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నాం. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్ ‌తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశాం” అని పంజాబ్‌ పోలీసులు ట్విటర్‌లో వెల్లడించారు. ఆ ముఠా నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు (పి-86), ఐఈడీ, రెండు 9ఎం.ఎం. పిస్టోళ్లు, 40 కాట్రిడ్జ్ ‌లు సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంజాబ్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.