News

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖ‌రారు

463views
  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల

అమ‌రావ‌తి: కోనసీమ జిల్లా పేరును.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం అసాధారణ జాప్యం, ఉదాసీనత ప్రదర్శించింది. ఇన్నాళ్ళుగా తుది నోటిఫికేషన్‌ రాకపోవడంతో… కలెక్టరేట్‌ సహా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల పేర్లు.. కోనసీమ జిల్లాగానే కొనసాగాయి. జిల్లా అధికారులు ఈ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తూ వచ్చారు.

కోనసీమ జిల్లా పేరును… డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ…. మే 18న ప్రభుత్వం ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి.. అభ్యంతరాల కోసం నెల రోజుల సమయమిచ్చింది. ఆ ప్రతిపాదనకు జూన్‌ 24 న రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఆ తర్వాత 40 రోజులకు ప్రభుత్వం తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం గమనార్హం.

సాధారణంగా మంత్రి మండలి ఆమోదం తెలిపిన తర్వాత … వారంలోపే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. కానీ దానికి భిన్నంగా ఇంత అసాధారణమైన జాప్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి