News

కాశ్మీర్లో మరోసారి తీవ్రవాదుల దుశ్చర్య. ఖుష్బూ హత్య.

645views

కేంద్ర ప్రభుత్వం, సైన్యం యొక్క కఠిన వైఖరితో దిక్కుతోచని స్థితిలో వున్న తీవ్రవాదులు ఏదో విధంగా వాళ్ళ ఆగ్రహాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఖుష్బూ జాన్ అనే మహిళా పోలీసాఫీసర్ని పొట్టన పెట్టుకున్నారు. దక్షిణ కాశ్మీర్లోని సోఫియాన్ ప్రాంతంలోని వేహిల్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఖుష్బూ పై దుండగులు అతి సమీపం నుంచే కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దుండగుల కోసం రక్షణ దళాలు కాశ్మీర్ వ్యాలీని జల్లెడ పడుతున్నారు.