News

బీహార్‌లో వినూత్నంగా నాగ పంచమి వేడుకలు

172views
  • విష సర్పాలను మెడకు చుట్టుకున్న గ్రామస్థులు

బీహార్​: బీహార్​లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్​చాక్ మండలం ఆగా​పుర్ గ్రామస్థులు మాత్రం ఇందుకు భిన్నం. వేడుకల్లో భాగంగా.. భగత్ అని పిలిచే కొందరు పూజారులు గ్రామంలోని ఓ నీటి కుంట నుంచి వందల పాములను బయటకు తీస్తారు. మంత్రాలు ఉచ్ఛరిస్తూ పాములను తీసి.. వాటితో విన్యాసాలు చేస్తారు. మెడకు చుట్టుకొని ఆడిస్తారు. ఇవేవీ సాధారణ సర్పాలా అంటే కాదు. చాలా వరకు విషపూరితమైనవే. అయినా బెదరకుండా భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొంటారు. మరోవైపు, సమస్తీపుర్ జిల్లాలోని విభూతిపుర్​లో పదుల సంఖ్యలో పాములను ఊరేగించారు. పెద్ద సంఖ్యలో యువకులు.. సర్పాలను తమ చేతుల్లో పట్టుకొని రోడ్లపై తిరిగారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి