News

ఒత్తిడి లేకుండా ముందుకు సాగండి… కామన్వెల్త్ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన మోడీ

164views

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ నెల‌ 28 నుండి ఆగస్టు ఎనిమిదోతేదీ వరకు కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అథ్లెట్లలో స్ఫూర్తిని నింపేందుకు బుధవారం మోదీ వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ..”ఒత్తిడి లేకుండా మీ బలాన్ని నమ్మి బాగా ఆడండి. ఎలాంటి బెదురు, బెరుకు లేకుండా ఆడండి. తికమకపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి” అని అథ్లెట్ల బృందంతో అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి