News

`లో దుస్తులు’ తీస్తేనే నీట్ పరీక్ష

498views
  • విస్తుపోయిన కేరళ విద్యార్థునులు

తిరువ‌నంత‌పురం: కేరళలోని ఓ కళాశాలలో నీట్ పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థునులకు ఘోర అవమానం జరిగింది. `లో దుస్తులు’ తీసేస్తేనే పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చెయ్యడంతో అవమాన భారంతో, మానసిక వేదనతో అదే విధంగా పరీక్ష రాయవలసి వచ్చింది. ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ నిబంధన వల్ల తన కూతురు తీవ్ర మానసిక క్షోభ అనుభవించిందని ఆ విద్యార్థిని తండ్రి తెలిపారు. ఈ విషయంపై కొల్లం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

మార్ థోమా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో ఆదివారం నీట్‌ పరీక్ష రాసేందుకు తన కూతురు వెళ్ళింద‌ని, బ్రా తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారని ఆయ‌న ఫిర్యాదు చేశారు. మెటల్ హుక్స్ ఉన్నాయనే కారణంతో లోదుస్తులు తీసేయాలని, లేకపోతే పరీక్ష రాయనివ్వమని వారు చెప్పినట్టు పేర్కొన్నారు. దీని వల్ల పరీక్ష రాశాక తన కూతురు ఏడుస్తూ ఇంటికి వచ్చిందని వివరించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి