NewsSeva

గోదావరి వరద గ్రామాలలో అనితర సాధ్యమైన సేవలందిస్తున్న సేవాభారతి

802views

భయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద మహోగ్రంగా మారి వందలాది గ్రామాలను, వేలాది ఎకరాలను ముంచేసింది. వరద నీరు ఇళ్ళలోకి చేరడంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లల్లో పది అడుగుల పైనే వరద నీరు చేరింది. గండిపోచమ్మ గుడి శిఖరం కూడా మునిగి పోయింది. చుట్టూ నీరున్నా త్రాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితి. మన్యం ,తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలలోని వరద ప్రభావిత గ్రామాల్లో ఫ్రభుత్వ యంత్రాంగం తమ పద్దతిలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

వరదబాధితుల తక్షణ అవసరాలు గుర్తించిన RSS కార్యకర్తల సహకారంతో సేవా భారతి సహాయ కార్యక్రమాలు ప్రారంభించింది. రాజమహేంద్రవరం నుండి సహాయ సామాగ్రిని తీసుకుని బయలుదేరిన సేవాభారతి వాహనం చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏటిపాక ప్రాంతాల్లోని 5 వేల మంది వరదబాదిత ప్రజలకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, టార్చిలైటు తోపాటు నిత్యావసర వస్తువులు ఉన్న కిట్లను కార్యకర్తలు అందించారు.

కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలైన పాశర్లపూడిలంక, దొడ్డవరం, పెదపట్నంలంక శ్రీరాంపేట తదితర గ్రామాల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. భీమవరం, రాజోలు, అమలాపురం, తదితర ప్రాంతాల నుండి వచ్చిన వేలాది పాల పేకట్లు, బిస్కట్లు మరియు సరుకులతో కూడిన పేకెట్లను పంచారు. నరసాపురం వద్ద గండి పడే ప్రాంతాలను గుర్తించి ఇసుక బస్తాలు వేసి గట్లను రక్షించారు. కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల వారికి కూరగాయలు, మంచినూనె పాకెట్లు పంపిణీ చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సహాయం అందిస్తున్నారు. సేవాభారతి అందిస్తున్న సేవలను ప్రజలు ఎల్లెడలా కొనియాడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.