News

బంగ్లాదేశ్‌లో హిందూ ఆల‌యం ధ్వంసం

588views

ఢాకా: ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుకు నిర‌స‌న‌గా బంగ్లాదేశ్‌లోని ఒక హిందూ ఆల‌యం, దుకాణాలు, కొన్ని ఇళ్ళ‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. ఇస్లాం మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ఈ పోస్టు ఉందంటూ ఆందోళ‌న‌లు సాగాయ‌ని మీడియా నివేదిక‌లు వెల్ల‌డించారు. శుక్ర‌వారం సాయంత్రం న‌రైల్ జిల్లాలోని స‌హ‌ప‌రా గ్రామంలో ఇళ్ళ‌ను ధ్వంసం చేసిన గుంపును చెద‌ర‌గొట్ట‌డానికి పోలీసులు కాల్పులు జ‌రిపార‌ని స్థానిక పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ హ‌ర‌న్ చంద్ర‌పాల్‌ను ఉటంకిస్తూ స్థానిక ప‌త్రిక తెలిపింది. ఒక యువ‌కుడు ఫేస్‌బుక్‌లో అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్టు పెట్టాడ‌ని, ఆయ‌న కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు వివ‌రించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి