News

అమెరికా క్రికెట్‌లో ఆంధ్రా కుర్రాడు!

424views

వాషింగ్ట‌న్‌: ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఆల్​రౌండర్​ దువ్వారపు శివకుమార్​ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో బరిలో దిగాడు. ఇదే అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్​లో శివ‌కుమార్ రాణించలేకపోయాడు. 13 బంతుల్లో ఏడు పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు. ఇందులో ఓ ఫోర్​ ఉంది. బౌలింగ్​లో 2 ఓవర్లు వేసి 11 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్​ కూడా తీయలేదు.

శివకుమార్​ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్​-ఏ 40 మ్యాచులు(1334 పరుగులు, 45వికెట్లు), 16 టీ20లు(342 రన్స్​, 15 వికెట్లు) ఆడాడు. కోహ్లీ కెప్టెన్సీలో 2008లో అండర్​-19 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆఖరిసారిగా ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అమెరికాకు వలస వెళ్లాడు. అక్కడ కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధనను పూర్తి చేసుకున్న అతడికి ఇటీవలే అక్కడి జట్టులో చోటు దక్కింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి