News

పుల్వామా సూత్రధారి ముదస్సర్ అహ్మద్ ఖాన్ ఖేల్ ఖతం – కాల్చి చంపిన భారత్ ఆర్మీ

811views

ముదస్సర్‌ అహ్మద్‌ఖాన్‌.. పుల్వామా ఘటనకు మాస్టర్ మైండ్..! ఈ దాడిలో 43 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అసువులు బాసారు. ముదస్సర్‌ అహ్మద్‌ఖాన్‌ ఈ ఘటన వెనుక ఉన్నాడని తెలుస్తోంది. ఉగ్రదాడిలో ఆత్మాహుతి చేసుకున్న ఆదిల్‌ అహ్మద్‌దార్‌ దాడికి ముందు పలుమార్లు మహ్మద్‌ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేల్చారు. పుల్వామా ఘటనలో మానవబాంబ్‌గా మారిన వ్యక్తికి వాహనంతోపాటు పేలుడు పదార్థాలు సరఫరా చేసింది ముదస్సర్‌ అహ్మద్‌ఖాన్‌. ఎప్పుడు దొరుకుతాడా అని భారత ఆర్మీ అతడి కోసం జల్లెడ వేసింది. అనుకున్నట్లుగానే ఆ రాక్షసుడు ఓ చోట దాక్కున్నాడు. ప్రాణాలతో పట్టుకోవాలని భావించారు. కానీ ఎదురుదాడికి దిగాడు.. అంతే కాల్చి చంపేశారు భారత జవాన్లు. దెబ్బకి పుల్వామా ఘాతుకానికి కారకుడైన మరో దుర్మార్గుడి ఖేల్ ఖతమైంది.