
1.1kviews
పాక్ లో ఇప్పటికీ ఇంకా 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో తొమ్మిది మసూద్ అజర్ జైషే మహ్మద్ సంస్థకు చెందినవని భారత అధికారి ఒకరు తెలిపారు. ఆ శిబిరాలపై పాక్ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. భారత సరిహద్దుకు ఆవల ఉన్న ఉగ్రశిబిరాలపై పాక్ చర్యలు తీసుకుంటే సరేసరి అని, లేదంటే బాలకోట్ జరిపిన వాయుదాడుల్లాంటివి మరోమారు తప్పవని పాక్‌కు హెచ్చరికలు జారీ చేశారు.
ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రబిందువుగా మారిందని, ఉగ్రవాద సంస్థలపై ప్రపంచం నమ్మదగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరోసారి భారత సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలు తీవ్రమైతే ముమ్మాటికి మళ్లీ బాలాకోట్ మాదిరి వైమానిక దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు.






