NewsSeva

సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజన మహిళల సన్మానం

201views

తే.08/3/2019 .ది, శుక్రవారం  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింహపురి వైద్య సేవా సమితి, జయభారత్ హాస్పిటల్ వారు “గిరిజన మహిళల స్వావలంబన సదస్సు” నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గిరిజన కుటుంబాలను ఆరోగ్య విషయాలలో చైతన్య పరుస్తూ గిరిజనుల స్వావలంబనకు కృషి చేస్తున్న గిరిజన మహిళలను ఘనంగా సన్మానించడం జరిగింది. వీరు జయభారత్ హాస్పిటల్ “వైద్య మిత్రలు”గా పని చేస్తున్నారు. అలాగే జాతీయ వెటరన్ అథ్లెటిక్ క్రీడాకారిణి మానికల రామసుబ్బమ్మ గారిని సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆరెస్సెస్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు మాట్లాడుతూ స్వావలంబన ద్వారా చదువు, చదువు ద్వారా ధనం సంపాదించి గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. DTWO శ్రీమతి విద్యారాణి మాట్లాడుతూ గిరిజనులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను వివరించటం జరిగింది. ఈ కార్యక్రమానికి “స్వర్ణ భారత్ ట్రస్ట్” చైర్మన్ శ్రీమతి దీపా వెంకట్ రావాల్సివుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సంస్థ ద్వారా జరిగే అన్ని పథకాలలో గిరిజన మహిళల ప్రయోజనాలకు ప్రధమ స్థానం కల్పించి విద్య, వైద్య విషయాలలో గిరిజనులకు  వెన్ను దన్నుగా నిలుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి సింహపురి వైద్య సేవా సమితి అధ్యక్షులు శ్రీ పొన్నలూరి సీతారామిరెడ్డి, రిటైర్డ్ RDO శ్రీమతి G.C సరస్వతమ్మ, “సత్య సేవా సమితి” నాగలక్ష్మి, పొట్లూరి విజయలక్ష్మి, జయభారత్ హాస్పిటల్ మేనేజర్ శ్రీ మారెళ్ళ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.