News

కాషాయ జెండాకు అఖిలేష్ అవహేళన… నిప్పులుచెరిగిన బీజేపీ!

477views

ల‌క్నో: రావి చెట్టు కింద కాషాయ జెండా పెడితే అది దేవాలయంగా మారుతుందంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నిప్పులుచెరిగారు.

అఖిలేష్ సనాతన హిందుత్వ సారాంశాన్ని మర్చిపోయారని, ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు కొత్త కాదంటూ విమర్శించారు. అఖిలేష్ బుజ్జగింపు మత్తు రాజకీయాల్లో ఉన్నారంటూ మౌర్య ఎద్దేవా చేశారు. తన ట్విట్టర్ ద్వారా అఖిలేష్‌పై విమర్శలు గుప్పించారు. గురువారం లఖ్‌నవూలో నిర్వహించిన విలేఖ‌రుల సమావేశంలో అయోధ్య ప్రస్తావన గురించి ప్రశ్నించగా.. ‘‘మన హిందుత్వంలో ఏదైనా ఎక్కడైనా ఒక రాయిపై కానీ రావి చెట్టుపై కానీ జెండా పాతితే వెంటనే ఆ ప్రాంతం దేవాలయంగా మారిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి