News

బీజేపీ నేత అరెస్ట్… పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు!

215views

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఢిల్లీలో అరెస్టు చేసి, పంజాబ్ తీసుకెళ్తున్న ఆ రాష్ట్ర పోలీసులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బగ్గాను పంజాబ్ పోలీసులు కిడ్నాప్ చేసినట్టు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన యువమోర్చా జాతీయ కార్యదర్శి.

బ‌గ్గాను అరెస్టు చేయడంలో సరైన నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. ఆయనను తిరిగి ఢిల్లీ తీసుకెళ్తున్నారు. ట్విటర్ పోస్టులు, మీడియా ఇంటర్వ్యూలలో మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు బగ్గాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బగ్గాను అరెస్టు చేస్తున్నట్టు జనక్‌పురి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చి, శుక్రవారం ఉదయం పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో ఉన్న ఆయన నివాసం నుంచి ఆయనను అరెస్టు చేశామని పంజాబ్ పోలీసులు తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని ఐదు నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆయన హాజరు కాకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని పేర్కొన్నారు.

అయితే, బగ్గా తల్లి కమల్ జీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ పోలీసులు తన కుమారుడిని మతాచారం ప్రకారం ధరించే తలపాగాను ధరించనివ్వలేదని పేర్కొన్నారు. పైగా, పోలీసుల చర్యలను వీడియో తీస్తున్న తన భర్తపై దాడి చేశారని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాదాగిరి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పంజాబ్ పోలీసు బృందం సరైన విధానాన్ని అనుసరించలేదని ఢిల్లీ పోలీసులు ఆరోపించడంతో బగ్గాను హర్యానాలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి