
901views
మొఘల్ చక్రవర్తులను ఎదిరించి హిందూ స్వాభిమానాన్ని చాటిచెప్పి హిందూరాజ్య స్థాపనతో జాతి గరిమను చాటిన ధీరుడు ఛత్రపతి శివాజీ అని ఆరెస్సెస్ క్షేత్రప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ కొనియాడారు.
ఈ రోజు ఒంగోలు ఆరెస్సెస్ కార్యాలయంలో జరిగిన “స్వరాజ్యం నుండి సురాజ్యం దాకా” పుస్తక పరిచయం కార్యక్రమంలో ముఖ్య వక్తగా వారు మాట్లాడుతూ శివాజీ గురించి చరిత్రవక్రీకరణ జరిగిందని, వారి గురించి సరైన కోణంలో అర్థం చేసుకోవటంలో ఈ గ్రంధం విశేషముగా తోడ్పడుతుందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘచాలక్ మాననీయ మండవ నాగేశ్వరరావు, స్వయసేవకులు, నగరంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.





