News

హిందూ సమాజం ఎన్నో సవాళ్ళను అధిగమించి నిలచింది – ఆరెస్సెస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాం కుమార్.

854views

25/2/2019 సోమవారం ఒంగోలు AKVK కళాశాలలో  ఒంగోలు నగర విద్యార్ధేతర కార్యకర్తల సాంఘిక్ జరిగింది. దీనిలో క్షేత్రప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ గారు పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ,ఈ దేశంలో హిందూసమాజం అనేక దాడులను తట్టుకొని తన అస్తిత్వాన్ని నిలుపుకొన్న గొప్పసంసృతని కొనియాడారు. ప్రపంచంలో అనేక సంస్కృతులు పరమతాల దాడులతో కనుమరుగైపోగా ఈ సమాజాజానికున్న శక్తితో హిందూత్వం నిలబడిందని వారు అన్నారు. RSS ఈ శక్తిని జాగృతం చేస్తూ గత 93 సం లుగా అనేక సవాళ్ళను ఎదుర్కొని సమాజ హితమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ప్రభుత్వాల హిందూత్వ వ్యతిరేక వైఖరికి ప్రతిగా సమాజాన్ని జాగృతపరచి వారి ప్రయత్నాలను అడ్డుకొన్నదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్క స్వయంసేవక్ జనజాగరణ లో పాల్గొని కేంద్రంలోని జాతీయ ప్రభుత్వం సాధించిన విజయాలను సమాజానికి తెలియపరచి ధర్మాన్ని కాపాడే పాలకులను ఎన్నుకొనుటకై జనతను జాగృతపరచి విస్తృతంగా పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.భారతమాత ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది.