NewsProgramms

విద్యాభారతికి భూమి, భవనాలను దానమిచ్చిన శ్రీ CBR ప్రసాద్

654views

బ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో తన భూమిలో నిర్మించిన భవనాలను, సుమారు 6 ఎకరాల భూమిని విద్యాభారతి, ఆంధ్రప్రదేశ్ సంస్థకు శ్రీ చలసాని బలరామ ప్రసాద్ (సి.బి.ఆర్) దానంగా ఇచ్చారు.

05.05.2022 ఉదయం గం॥ 11.00లకు కేతనకొండ సి.బి.ఆర్. స్పోర్ట్స్ అకాడమిలో జరిగిన దానసమర్పణ కార్యక్రమములో అకాడమీ ఛైర్మన్ శ్రీ చలసాని బలరామ ప్రసాద్ మాట్లాడుతూ తనకు చిన్నప్పుడే తనతల్లి దానగుణాన్ని అలవాటు చేసిందని, తాను ఆర్మీలో పనిచేస్తున్నప్పుడే ఈ దేశానికి ఏదొక రూపంలో సేవచేయాలని భావించానని, శారీరిక, మానసిక దారుఢ్యంగల యువతీ, యువకులే దేశానికి ఆశాకిరణాలని భావించి స్పోర్ట్స్ అకాడమీని స్థాపించి వందలాది బాల, బాలికలకు క్రీడలలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా 26వేల పాఠశాలల ద్వారా 36లక్షలమంది బాల, బాలికలకు జాతీయవిద్య నందిస్తున్న విద్యాభారతి కార్యకలాపాలు తనను ఎంతో ఆకట్టుకొన్నాయని, ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థుల గురించి తెలుసుకుని, వారు సమాజానికి, దేశానికి చేస్తున్న సేవలను గుర్తించి ప్రభావితమయ్యానని, ఈసంస్థ ద్వారా తన సంకల్పం నెరవేరుతుందని భావించి విద్యాభారతికి తన భూమిని, భవనాలను దానంగా ఇస్తున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సి.బి.ఆర్. అల్లుడు శ్రీ చింతమనేని మనోజ్, కూతురు మాధవి పాల్గొని తన తండ్రి చేస్తున్న సత్కార్యానికి తమ సమ్మతిని తెలియజేశారు. విద్యాభారతి కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల సంఘటనా కార్యదర్శి శ్రీ లింగం సుధాకర రెడ్డి మాట్లాడుతూ శ్రీ సి.బి.ఆర్ చేస్తున్న సేవలను, దాతృత్వాన్ని కొనియాడుతూ వారి సంకల్పం నేరవేరే పద్ధతిలో వారు దానమిచ్చిన స్థలంలో ఒక రెసిడెన్షియల్ సి.బి.ఎస్.ఈ పాఠశాలను, ఉపాధ్యాయుల శిక్షణా కేంద్రమును ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమములో ఆర్. ఎస్. ఎస్. ప్రాంత కార్యవాహ శ్రీ వేణుగోపాల నాయుడు, ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్, క్షేత్ర సంపర్క ప్రముఖ్ శ్రీ వినోద్ కుమార్, విద్యాభారతి సహకార్యదర్శి శ్రీ కె.వి. ఆనంద్ సభను అలంకరించగా విజయవాడ నగరంలోని అనేకమంది ప్రముఖులు, విజ్ఞాన విహార పాఠశాలల ఉపాధ్యాయులు, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల విద్యాపీఠ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీ కన్నా భాస్కర్, కోశాధికారి శ్రీ సన్నిధి సుబ్బారావులు కూడా పాల్గొన్నారు.

విజ్ఞాన విహార – విజయవాడ బాల, బాలికలు ఆలపించిన ప్రార్థన, దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.