News

వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలలో 4జి మొబైల్ సేవలు

437views

* యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ప్రాజెక్టుకు ఆమోదం

* కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం వామపక్ష తీవ్రవాద ప్రాబల్య (ఎల్.డబ్ల్యూ.ఇ) ప్రాంతాలలోని భద్రతా శిబిరాల వద్ద 2జి మొబైల్ సేవలను 4జి కి అప్ గ్రేడ్ చేయడం కోసం యూనివర్స ల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ఒఎఫ్) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ను వామ పక్ష తీవ్రవాద (ఎల్.డబ్ల్యూ.ఇ) ఫేజ్-1 సైట్లను 2జి నుండి 4జి మొబైల్ సేవలకు 1,884.59 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో (పన్నులు, సుంకాలు మినహాయించి) అప్ గ్రేడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఐదేళ్ల పాటు ఓ అండ్ ఎం కూడా ఉంది. బిఎస్ఎన్ఎల్ తన సొంత ఖర్చుతో మరో ఐదు సంవత్సరాల పాటు ఈ సైట్లను నిర్వహిస్తుంది. అలాగే రూ. 541.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధికి మించి పొడిగించబడిన కాలానికి బిఎస్ఎన్ఎల్ ద్వారా ఎల్ డబ్ల్యుఇ ఫేజ్-1 లో 2జి సైట్ల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఖర్చుకు నిధులు సమకూర్చడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.