News

జమ్మూలో రూ.20వేల కోట్లతో అభివృద్ధి పనులు

624views

జమ్ము: జమ్ములో రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించ‌నున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూ నుంచే జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం జమ్ముకశ్మీర్‌లో పూర్తిస్థాయి పర్యటన చేయనున్నారు.

ఈ పర్యటనలో ఆయన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ‘జాతీయ పంచాయతీ రాజ్‌’ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి