
439views
గాంధీనగర్: ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కోసం అక్కడి పాలంపూర్ సర్క్యూట్ హౌస్‌లో బుధవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు అసొం పోలీసులు తెలిపారు.
మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ మేవానీ ఈ నెల 18న ఓ ట్వీట్ చేశారు. వివాదాస్పదంగా ఉన్న ఆ ట్వీట్‌ను ట్విట్టర్ తొలగించింది. అయితే, ఈ ట్వీట్ ఆధారంగా మేవానీపై చర్యలు తీసుకోవాలంటూ అసొంలోని కోక్రాఝర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త అరూప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే మేవానీని పోలీసులు అరెస్ట్ చేశారు.
Source: Nijamtoday





