News

భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని.. పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చ

500views

న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజ‌రాత్​ చేరుకున్నారు. అహ్మాదాబాద్ విమానాశ్రయంలో ఆయనకు సీఎం భూపేశ్ పటేల్ పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని బోరిస్‌ జాన్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇరు దేశాల ప్రజల అనుబంధాన్నీ ఇనుమడింపజేస్తుందని తెలిపారు. తన పర్యటనను పురస్కరించుకొని బుధవారం బ్రిటన్‌ పార్లమెంటు దిగువసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘నా భారత్‌ పర్యటన రెండు దేశాల సంబంధాలను మరింత వేళ్లూనుకునేలా చేస్తుంది. దిల్లీలో ప్రధాని మోదీని, పారిశ్రామివేత్తలను కలుస్తాను’ అని జాన్సన్‌ తెలిపారు. తన ఆహ్వానం మేరకు కార్బిస్‌ బే జీ7 సదస్సులో మోదీ పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి