
709views
ఢిల్లీ : ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కారం ప్రధాని నరేంద్ర మోడీని వరించింది. ఇండియాను ఆర్థికంగా ముందుకు నడిపేలా… నిర్ణయాలు తీసుకోవడం, సంస్కరణలు అమలు చేస్తున్న కారణంగానే ప్రధానమంత్రికి ఈ అవార్డ్ దక్కిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఢిల్లీలో చెప్పారు.
అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలను బాగుచేసుకోవడంతో పాటు ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ప్రధాని నరేంద్రమోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారని అవార్డు కమిటీ చైర్మన్ క్వోన్ ఈ హైయోక్ చెప్పారు. నోట్లరద్దుతో ప్రధానమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని… ఈ నిర్ణయంతో అవినీతికి అడ్డుకట్ట పడిందని చెప్పారు. గతంలో ఈ అవార్డును యూఎన్ఓ మాజీ సెక్రటరీలుగా వ్యవహరించిన జనరల్ కోఫీ అన్నన్, బాన్ కీ మూన్ లు అందుకున్నారు. రెండేళ్లకోసారి అందించే ఈ అవార్డ్ అందిస్తారు. 2018 ఏడాదికి గానూ మోడీని ఎంపిక చేశారు.





