
చెన్నై: శ్రీరామ నవమి రోజున అయోధ్య మండపాన్ని డీఎంకే బలవంతంగా స్వాధీనం చేసుకుంది. భక్తుల కోరికలను పట్టించుకోకుండా, అలుపెరగని ‘హిందూ ఫోబిక్’ డీఎంకె ప్రభుత్వం చెన్నైలోని 64 ఏళ్ళ శ్రీరామ సమాజం అకా అయోధ్య మండపాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది.
చెన్నై కార్పొరేషన్‌లోని ఏకైక బీజేపీ కౌన్సిలర్, హిందూ దేవాలయాల పరిరక్షణ ఉద్యమ నాయకులు ఉమా ఆనందన్ ఆర్గనైజర్‌తో మాట్లాడుతూ, ‘‘పశ్చిమ మాంబళంలోని అయోధ్య అశ్వమేధ మహా మండపం అధ్యాత్మిక ప్రసంగాలు, రాధా కళ్యాణాలు, హోమాలు, భజనలు, పవిత్రమైన దారం ధరించే కార్యక్రమాలకు నిలయమన్నారు. కృష్ణ జయంతి, రామ నవమి జరుగుతుంటాయని తెలిపారు.
సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మండపాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునే హక్కు హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్(హెచ్‌ఆర్ అండ్ సీఈ)కి లేదని, ఈ సమస్యకు సంబంధించి షోకాజ్ నోటీసు ఇవ్వలేదని అన్నారు. చిదంబరం ఆలయ తీర్పును ఉమా ఆనందన్ ఉదహరించారు. ఆక్రమణల పేరుతో హిందూ దేవాలయాలను కూల్చివేయడంలో బిజీగా ఉన్న ప్రభుత్వం… చర్చిలు, మసీదుల జోలికి వెళ్ళడం లేదని విమర్శించారు.
కోర్టు ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు అమీజికరైలోని కూమ్‌పై నిర్మించిన చర్చిని కూల్చివేసేందుకు వెళ్ళారని, అయితే, ఆ చర్చి ఒక గంటలో కొన్ని వందల మందిని సమావేశపరిచింది. ఇరువైపులా రోడ్లను బ్లాక్ చేసింది. శాంతిభద్రతల సమస్యకు భయపడి, అధికారులు వెనక్కి వెళ్ళిపోయారని ఈ సందర్భంగా అధికారుల వైఖరిని గుర్తు చేశారు.
Source: Organiser





