NewsProgramms

వందేళ్ళ నాటి ఆలయానికి పునర్వైభవం

654views

* ధర్మజాగరణ సమితి కార్యకర్తల కృషితో ఆలయానికి కొత్త హంగులు

* శ్రీరామనవమి నాడు 15 జంటలతో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

ట్టుదల ఉంటే కానిది లేదని ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు మరోసారి ఋజువు చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని నగరం వీరవరపు పేట (హరిజన పేట)లో సుమారు 10 సంవత్సరాలుగా ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిధిలావస్థలో ఉన్న సుమారు 100 సంవత్సరాల క్రిందటి శ్రీరామ మందిరాన్ని అక్కడి ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు పునరుద్ధరించారు.

మరమ్మత్తులు చేయకముందు ఆలయం స్థితి

మరమ్మత్తుల అనంతరం

పూజలో పాల్గొన్న భక్తులు

100 సంవత్సరాల కిందటి ఆ ఆలయం దర్శనానికి వచ్చే భక్తులు లేక, దీపం పెట్టే నాథుడు లేక, నైవేద్యం పెట్టే గతిలేక 10 సంవత్సరాలుగా వెలవెలబోతోంది. దీనిని గమనించిన స్థానిక ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు ఆ గుడిని శుభ్రపరిచి, చిన్నచిన్న మరమ్మత్తులు చేయించి, రంగులు వేయించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. అంతటితో ఆగక శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానికంగా ఉన్న 15 హరిజన దంపతుల జంటలతో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. వీరవరపు పేటలోని వందల మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించి పులకించిపోయారు. దశాబ్దం పాటు శిధిలావస్థలోనే ఉండిపోయిన వందేళ్ళ ఆలయానికి పునర్వైభవాన్ని తెచ్చిపెట్టిన ధర్మ జాగరణ సమితి కార్యకర్తలకు గ్రామస్తులు ప్రశంసలు అందిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.