News

దళిత బాలికపై అత్యాచారం: ఎనిమిది మంది అరెస్టు!

573views
  • నిందితుల్లో ఇద్ద‌రు డీఎంకే కార్య‌క‌ర్త‌లు

విరుదున‌గ‌ర్‌(త‌మిళ‌నాడు): త‌మిళ‌నాడులోని అమ్మాయిలకు రోజు రోజుకూ రక్ష‌ణ క‌ర‌వ‌వుతోంది. రాజ‌కీయ కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ఇత‌ర యువ‌కుల వ‌ల్ల మ‌హిళ‌ల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. లవ్, బ్లాక్‌మెయిలింగ్, లవ్ జిహాద్ పేరుతో అన్ని వయసుల అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఓ సంఘ‌ట‌న‌లో తాజాగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దారుణం ఏమిటంటే, ఇందులో ఇద్ద‌రు డీఎంకే కార్య‌క‌ర్త‌లు ఉండ‌డం! విరుదునగర్ జిల్లాకు చెందిన 22 ఏళ్ళ‌ దళిత మహిళపై ఇద్దరు డీఎంకె కార్యకర్తలు, నలుగురు యువకులు సహా ఎనిమిది మంది వ్యక్తులు నెలల తరబడి పదే పదే అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

హరిహరన్… స్థానిక డిఎంకె యువజన విభాగం కార్యకర్త. అతను ఆ మహిళని ప్రేమలో బంధించి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్క‌డ అత్యాచారం చేసి, దానిని వీడియో తీశాడు. స్నేహితుల‌కు పంపాడు. హ‌రిహ‌ర‌న్‌, అత‌ని స్నేహితులు దీనిని సోష‌ల్ మీడియోలో షేర్ చేస్తామ‌ని ఆ అమ్మాయిని బెదిరించారు. ఇలా… ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ ప‌లుమార్లు అత్యాచారం చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి