News

భారత విద్యార్థులకు రష్యాలోని రాయబార కార్యాలయం కీలక సూచనలు

401views

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. రష్యాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. భారత విద్యార్థులు ప్రస్తుతం రష్యాను వీడేందుకు ఎటువంటి భద్రతా కారణాలు కనిపించడం లేదని తెలిపింది.

విద్యార్థులతోసహా భారతీయ పౌరుల భద్రత విషయమై సంబంధిత అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. అయితే, రష్యాలో బ్యాంకింగ్ సేవలతోపాటు ఇక్కడి నుంచి భారత్‌కు నేరుగా విమాన కనెక్టివిటీ విషయంలో అంతరాయం ఏర్పడుతోన్న మాట వాస్తవమేనని.. ఈ విషయాల్లో ఆందోళన ఉన్నవారు తిరిగి భారత్‌కు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చని సూచించింది.

అకాడమిక్ ప్రోగ్రామ్‌లకు సంబంధించి అనేక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఆన్‌లైన్ దూరవిద్య విధానానికి మారినట్టు తమకు సమాచారం ఇచ్చాయని పేర్కొంది. ఈ విషయమై విద్యార్థులు సంబంధిత విశ్వవిద్యాలయాలతో టచ్‌లో ఉండాలని సూచించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి