
593views
ముంబై: ముంబయి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం మనీలాండరింగ్ కేసుతో సంబంధమున్నట్టు గట్టి అభియోగాలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అంతకుముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదుచేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆయనను విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
Source: EtvBharat





