
గడచిన ఏడు దశాబ్దాలుగా రిపబ్లిక్ డే వేడుకల బీటింగ్ రిట్రీట్ (రిపబ్లిక్ డే వేడుకల ముగింపు ఉత్సవం) సందర్భంగా పాడుతూ వస్తూ ఉండిన ఒక క్రైస్తవ కీర్తనను కేంద్ర ప్రభుత్వం తాజాగా తొలగించింది. ఈనెల 29వ తారీఖున జరగనున్న రిపబ్లిక్ డే బీటింగ్ రిట్రీట్ వేడుకలలో ఇప్పటివరకూ పాడుతూ వస్తూ ఉండిన ” అబైడ్ విత్ మినీ” అనే క్రైస్తవ కీర్తన స్థానంలో “ఆయే మేరే వతన్” అనే దేశభక్తి గీతాన్ని పాడనున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా రిపబ్లిక్ డే వేడుకలలో క్రైస్తవ గీతం :
1947లో హెన్రీ ఫ్రాన్సిస్ అనే స్పానిష్ ఆంగ్లికన్ కవి రాసిన “అబైడ్ విత్ మినీ” అనే క్రైస్తవ ప్రార్థనా గీతాన్ని 1950 నుంచి మనదేశంలో జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాడుతున్నారు. నిజానికి ఈ విషయం ఎవరికీ తెలీదు. మీడియా కూడా ఏనాడూ దీనిని గురించి చర్చించలేదు.
ఆ గీతాన్ని రిపబ్లిక్ డే ముగింపు ఉత్సవాల నుంచి తొలగించిన ప్రస్తుత పరిస్థితులలో మాత్రం కాంగ్రెస్ దీనిపై గొడవ చేస్తోంది. గాంధీజీకి ఇష్టమైన ఈ గీతాన్ని తొలగించడంలో మోడీ ప్రభుత్వానికి దురుద్దేశ్యం ఉన్నదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.





