News

జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్ కన్నుమూత.. వాజ్ పేయి హయాంలో రక్షణ మంత్రిగా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు..!

540views

జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్.. వాజ్ పేయి హయాంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్న సమయంలోనే ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది భారత్. 88 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా అల్జీమర్స్ తో బాధపడుతున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం స్వైన్ ఫ్లూ సోకింది. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు.

వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన రక్షణ మంత్రిగా పనిచేశారు. 1930 జూన్ 3న మంగళూరులో జన్మించిన ఆయన,  1967లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. జనతాదళ్ పార్టీలో కీలక నేతగా ఎదిగి, ఆపై సమతా పార్టీని స్థాపించిన ఆయన, రక్షణ శాఖతో పాటు సమాచార, పరిశ్రమల, రైల్వే శాఖలను కూడా నిర్వహించారు. ఎమర్జెన్సీ సమయంలో ఈయనను అరెస్ట్ చేశారు. ఆయన లోక్ సభకు తొమ్మిది సార్లు ఎన్నికయ్యారు.

1967లో జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ముంబై నుంచి ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థిపై విజ‌యం సాధించి దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక ర్షించారు. 1975 ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ఫెర్నాండెజ్‌ను అరెస్టు చేసి సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల‌తో జైలుకు పంపారు. 1977లో ఆయ‌న జైలు నుంచే ఎన్నిక‌ల‌కు పోటీప‌డి.. ముజ‌ఫ‌ర్‌పూర్ నుంచి అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఎన్డీఏ ప్ర‌భుత్వంలో ఫెర్నాండేజ్ 1998 నుంచి 2004 వ‌ర‌కు ర‌క్ష‌ణ మంత్రిగా పని చేశారు. ఆగ‌స్టు 2009 నుంచి జూలై 2010 వ‌ర‌కు ఆయ‌న చివ‌రిసారి రాజ్య‌స‌భ ఎంపీగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత అనారోగ్యంతో రాజ‌కీయాల‌కు దూరం అయ్యారు. అంతక ముందు మొరార్జీ దేశాయ్ ప్ర‌భుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా చేశారు.

Source : Bharath Today

https://www.bhaarattoday.com/news/national/story/30504.html