News

నిన్న శ‌బ‌రిమ‌ల‌..! నేడు సంస్కృత భాష‌..!! కుహనా లౌకిక‌వాదుల కుట్ర‌లు

594views

ఈ దేశంలో హిందువుగా పుట్ట‌డ‌మే పాపమా..? సంస్కృతంలో ప్రార్ధన చేస్తే మ‌తోన్మాదమా..? ఎక్క‌డికి వెళ్తున్నాం మ‌నం..?  సంస్కృతం ఈ దేశ జీవ‌నాడి. సంస్కృతంలో ప్రార్ధ‌న‌ల‌ను సైతం వివాదాస్ప‌దం చేసిన కుహానా లౌకిక‌వాదులు. మొన్న శ‌బ‌రిమ‌ల.. నిన్న ఆయోధ్య‌.. నేడు సంస్కృత భాష‌. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో దేశంలో హిందూ మూలాల‌ను దెబ్బ తీసేందుకు కుట్ర‌లు చేస్తున్నారా..? త‌మ‌ కుట్ర‌ల‌ను అమ‌లు చేసేందుకు అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని ఆస‌రాగా చేస్కుంటున్నారా.?

దేశ వ్యాప్తంగా ఉన్న 1,125 కేంద్రీయ విద్యాలయాల్లో ఉదయం పార్థనా సమయంలో సంస్కృతం, హిందీ శ్రోకాల పారాయణం తప్పనిసరి నిబంధనపై వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది.  ఈ పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్ వినాయక్ షా అనే న్యాయవాది వేశారు. వారి పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదువు పూర్తిచేశారు. ఆయన కేంద్రీయ విద్యాలయాల్లో ఉదయం సంస్కృతం, హిందీ శ్లోకాల పారాయణం నిలిపివేయాలని ఆయన పిటిషన్ లో  పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఇది శాస్త్రీయంగా ఆలోచించేందుకు  పూర్తి అడ్డంకిగా మారిందని అభిప్రాయపడ్డారు. దేవుడు, మత నమ్మకం అనేవి విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ మెంట్ కు పూర్తి అవరోధాలుగా ఉన్నాయని సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇలా విద్యార్థులతో ఉదయాన్నే ఇలాంటి ప్రార్థనలు చేయించటం తగదని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ గా ఆలోచించే శక్తి నశిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గత ఏడాది జనవరి 10న సుప్రీంకోర్టు పారాయణంపై కేంద్రీయ విద్యాలయాల అభిప్రాయాన్ని కోరింది. “ఈ పారాయణం ఏదైనా మతానికి అనుగుణంగా ఉందా?” అని ప్రశ్నించింది. ఉదయం ప్రార్థన హిందీ, సంస్కృతంలలో చేయల్సిన పరిస్థితి. ఇతర మతాల విద్యార్థులు కూడా తప్పనిసరిగా ఈ ప్రార్థనలో పాల్గొనాల్సి వస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. 1964 నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. ఉదయం ప్రార్థన హిందీతో ప్రారంభమై సంస్కృత శ్లోకంతో ముగుస్తుంది.