
417views
-
బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పెల్లుబికిన నిరసన
బెంగళూరు: బెంగళూరులో ఛత్రపతి శివాజీ విగ్రహంపై సిరా జల్లి దుండగులు విగ్రహాన్ని అపవిత్రం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో బెలగావిలో నిరసనలు పెల్లుబికాయి. హిందూ, మరాఠీ సంఘాలు శుక్రవారం అర్ధరాత్రి స్థానిక సంభాజీ చౌక్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగాయి. నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రాందేవ్ గల్లీలో ఓ ఆటో డ్రైవర్ను నిరసనకారులు చితకబాదారు.
హుతాత్మ సర్కిల్లో ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇతర ప్రభుత్వ వాహనాలపైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. పలు వాహనాల బోర్డులను తొలగించారు. ఈ ఘటనలో ఆరు ప్రభుత్వ కార్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. విగ్రహ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.




