News

ఉచిత పథకాలతో ఏపీలో భారీగా రెవెన్యూ లోటు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

471views

ఆంధ్రప్రదేశ్ లో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ పథకాల వల్ల ఊహించిన దాని కంటే ఎక్కువ రెవెన్యూ లోటు ఏర్పడిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లోపంతో ఏపీలో లోటు పెరిగిందని కాగ్ నివేదిక చెప్పిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.