-
అలప్పుజ జిల్లాలో గుర్తింపు
-
కోళ్ళు, పెంపుడు జంతువులను చంపాలని నిర్ణయం
తిరువనంతపురం: దేశంలో ఓ వైపు కరోనా వైరస్, ఒమిక్రాన్ విజృంభిస్తుంటే తాజాగా కేరళలలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే జనాలు వ్యాక్సిన్‌లేని వైరస్‌లని ఎదుర్కొంటుంటే ఇప్పుడు జంతువులకు కూడా ఆ పరిస్థితి ఎదురైంది. బర్డ్ ఫ్లూ వల్ల గతంలో చాలా జంతువులు, పక్షులను చంపేశారు. ఇప్పుడు కేరళలోని అలప్పుజ జిల్లాలోని తకాళి పంచాయతీ పరిధిలో ఈ వైరస్‌ని గుర్తించినట్టు అధికారులు వెల్లడిరచారు. ఇది మరింతగా పెరగకుండా ఉండేందుకు పంచాయతీ పరిధిలోని పదో వార్డు చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న కోళ్ళు, బాతులు, ఇతర పెంపుడు జంతువులను చంపేయాలని నిర్ణయించారు.
బర్డ్ ఫ్లూ తక్కువ సమయంలోనే ఎక్కువ పరిధిలో విస్తరిస్తుంది. అందుకే అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోళ్ళని, పెంపుడు జంతువులని చంపేయడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ అనే ప్రత్యేక టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. స్థానిక పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టర్ అలెగ్జాండర్ పశుసంవర్ధక, ఆరోగ్య, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. బర్డ్ ఫ్లూ ఎట్టి పరిస్థితుల్లో విస్తరించకుండా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Source: Tv9