News

అఖండ సినిమాకు వెళదాం పద..

686views

నంద్యాల: అఖండ సినిమాకు వెళదాం పద.. సనాతన ధర్మం ఏమిటో తెలుస్తుంది… ఎవడవయ్యా నువ్వు? ఎవడు చేశాడయ్యా పాపము ఇక్కడ… మేము పాపం ఎందుకు చేస్తాం.. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇవే మాటలా…? పాపమూ లేదూ ‘పుస్తకం’ లేదూ… పో… ఇక్కడ్నించి… ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు.. మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అంటూ ఓ వ్యక్తి అన్యమత ప్రచారం చేస్తున్న వ్యక్తులకు గట్టిగా గుణపాఠం చెప్పాడు. కొన్ని ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలను పెట్టనివ్వలేదు… అలాంటప్పుడు మీరు మా ఇళ్ల దగ్గరకు ఎలా వస్తారు? అని గట్టిగా ప్రశ్నించడంతో మత ప్రచారకులకు దిక్కుతోచలేదు.

మా ప్రాంతంలో మత ప్రచారం చేస్తే క్షమించేది లేదు.. అన్నారాయన. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుందని తెలుస్తోంది. శివుడిని నమ్మవయ్యా.. అఖండ సినిమాకు వెళదాం పద.. సనాతన ధర్మం ఏమిటో తెలుస్తుంది పదా అంటూ రమ్మని పిలిచాడు. అత్యాచారాలు, దోపిడీలు చేసిన వారిని రక్షిస్తారా..? అంటూ హిందూ వ్యక్తి చెప్పడంతో ముఖాలు మాడ్చుకొని, అక్కడి నుండి మత ప్రచారకులు జారుకున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి