News

ఒమిక్రాన్ కట్టడికి అంతర్జాతీయ ఒడంబడిక అవసరం

448views
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

జెనీవా: కరోనా కట్టడికి ప్రపంచ దేశాల మధ్య ఓ సహకార ఒప్పందం అవసరమని డబ్ల్యూహెచ్​ఓ అభిప్రాయపడింది. భవిష్యత్​లో సరికొత్త వేరియంట్లు ఉద్భవించినప్పటికీ ధాటిగా ఎదుర్కొనడానికి వీలవుతుందని పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాతో జరిగిన సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్​గా టెడ్రోస్‌ అధనోమ్‌ పాల్గొన్నారు.

ప్రపంచ దేశాల మధ్య ఓ అవగాహన ఒప్పందం అవసరమని పేర్కొన్నారు. ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ లక్షణాలు తీవ్రంగా లేవని దక్షిణాఫ్రికాకు చెందిన డాక్టర్లు చెబుతున్నారు. గత 10 రోజుల్లోనే 81 శాతం కేసులు పెరిగాయని గాటెంగ్​ ప్రావిన్సుకు చెందిన డాక్ట‌ర్‌ ఉబెన్ పిల్లై తెలిపారు. ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. టీకా వేసుకోనివారి కంటే వ్యాక్సిన్​ వేసుకున్నవారిలో మరింత తక్కువ తీవ్రత కనిపిస్తోందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి