News

ఆ వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రి వర్గం ఆమోదం

424views
  • కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. అన్నదాతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురానున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి