News

లైన్ల పునరుద్ధరణ దిశగా రైల్వే చర్యలు

471views

విశాఖ‌ప‌ట్నం: భారీ వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతిని నిలిచిపోయిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్రమంగా పట్టాలెక్కిస్తోంది. ట్రాక్ మరమ్మతు పనులు పూర్తైన అనంతరం ఆయా రూట్లలో రైళ్లను పునరుద్దరిస్తోంది. పలు ప్రాంతాల మీదుగా వెళ్లే పలు రైళ్లను తిరిగి నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. రేపు నడిచే ఆరు రైళ్లను యథాతథంగా నడుపుతున్నట్టు తెలిపారు. రేపటి(గురువారం) తిరుపతి- హజరత్ నిజాముద్దీన్ రైలు , చెన్నై సెంట్రల్- ముంబై సీఎస్ఎంటీ , రైళ్లను పునరుద్ధ‌రించారు. రేపటి ముంబై సీఎస్ ఎంటీ -చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ -అహ్మదాబాద్ , చెన్నై సెంట్రల్ – ముంబై ఎల్ టీ టీ, ముంబై ఎల్ టీటీ- చెన్నై సెంట్రల్ రైళ్లు యథాతథంగా నడుస్తాయని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి