News

రష్యాలో కరోనా కలకలం

734views
  • పరిస్థితులు అదుపులో లేవన్న ఆ దేశ ప్రధాని

  • బాధితులతో నిండిపోయిన ఆసుపత్రులు

  • యూరప్ అంతటా ఇదే పరిస్థితి

మాస్కో: రష్యాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. కొవిడ్​ రోగుల కోసం రిజర్వు చేసిన మూడు లక్షలపైగా పడకలలో 82.8 శాతం మేరు నిండినట్టు ఆ దేశ ఉప ప్రధాని టాట్యానా గోలికోవా ఓ సమావేశంలో వెల్లడించారు. వైరస్​ అదుపులో ఉందని తాము ఇప్పటికీ చెప్పలేమని అన్నారు. దేశంలో వైరస్​ కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

కేసులను అదుపు చేయడానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుండడం వల్ల వైరస్​ కేసులు పెరుగుతున్నట్టు అధికారులు చెప్పారు. అంతేగాకుండా వ్యాక్సినేషన్ రేటు కూడా చాలా తక్కువగా ఉండడం స్థానిక అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. పూర్తి జనాభా 146 మిలియన్లుగా ఉంటే వారిలో కేవలం 40 శాతం మంది కూడా పూర్తి స్థాయిలో టీకా తీసుకోలేదు. అయితే దేశంలో ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్​కు పుతిన్ సర్కార్​ నెలల కిందటే ఆమోదం తెలిపటం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి