News

డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు ప్రారంభం

202views

షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసుతో పాటు మరో ఐదు డ్రగ్స్‌ కేసులపై శుక్రవారం ఏర్పాటైన మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వెంటనే పని ప్రారంభించింది.

శనివారమే ఢిల్లీ నుంచి ముంబయి చేరుకుని, ఈ కేసులకు సంబంధించిన పత్రాలన్నింటినీ ముంబయిలోని ఎన్‌సీబీ జోనల్‌ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకుంది. ఆయా కేసుల దర్యాప్తు ఎంతవరకు జరిగిందో తొలుత పరిశీలిస్తామని, ఆ తర్వాతే పునర్విచారణపై నిర్ణయం తీసుకుంటామని సిట్ ‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఆరు కేసుల దర్యాప్తు నుంచి తొలగింపునకు గురైన ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే మాత్రం దర్యాప్తులో తాను లేనప్పటికీ జోనల్‌ డైరెక్టర్‌ హోదాలో పర్యవేక్షక అధికారిగా కొనసాగుతానని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.