
* యాక్టివ్ గా 3200 స్లీపర్ సెల్స్
* వారిలో 40% మహిళలు
ఎప్పటి నుంచో కేరళ ఇస్లామిక్ ఉగ్రవాదులకు పుట్టిల్లు. ఇప్పుడు ‘యాంటీ టెర్రర్ సైబర్ వింగ్ ఇండియా’ ప్రచురించిన కొత్త నివేదికలో కేరళలో ISISతో సంబంధమున్న 3,200 స్లీపర్ సెల్స్ ఉన్నట్లు పేర్కొంది. ప్రతి స్లీపర్ సెల్ లో 10 మంది సభ్యులు ఉంటారని, మొత్తం 32,000 మంది స్లీపర్ సెల్ సభ్యులు కేరళలో చివరి జిహాద్ కు సిద్ధమవుతున్నారని నివేదిక పేర్కొంది.
“స్లీపర్ సెల్ సభ్యులలో దాదాపు 40% మంది మహిళలు. వారిలో ఎక్కువ మంది మతం మారిన ముస్లింలు” అని నివేదిక చెబుతోంది.
ఈ స్లీపర్ సెల్ సభ్యులు వివిధ అమశాలపై సోషల్ మీడియాలో చర్చను నడపడానికి, జిహాద్ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రజలను ఆకర్షించడానికి శిక్షణ పొందుతారు. వారు ఆయుధాలను ఉపయోగించడంలో కూడా శిక్షణ పొందారు. వారిలో కొందరు బాంబు తయారీలో నిపుణులు. సినిమా, వినోదం సహా అన్ని ప్రధాన రంగాల్లో స్లీపర్ సెల్ ఉందని నివేదిక పేర్కొంది. డబ్బు, సెక్స్, విదేశాలలో అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలను ఆఫర్ చేయడం ద్వారా అటువంటి వారిని ఆకర్షిస్తున్నారు.
అనేక దేశ వ్యతిరేక సంస్థలకు కేరళ నెలవు. ISISలో చేరడం కోసం ఇరాక్ మరియు సిరియా దేశాలకు వెళ్లే వారికి కూడా కేరళలో కొదవ లేదు.
Source : Organiser





