
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కమలనాథులను కలవరానికి గురిచేశాయి. కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపాయి. ఇలా ఓడిన పార్టీ డీలా పడటం.. గెలిచిన పార్టీ సంబరాలు చేసుకోవడం కామనే. కానీ ఈ సంబరాల్లో శత్రు దేశం పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే వార్తలు వచ్చాయి. అలాగే అటు ఈ ఫలితాలు…పాకిస్తాన్ కూడా సంతోష పరిచాయట.! కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే.. ఆ దేశంలో కూడా సంబరాలు జరుపుకున్నారట.ఇంతకీ అటు పాకిస్తాన్-ఇటు కాంగ్రెస్ గెలుపునకు ఉన్న లింకేమిటి? దేశ సమగ్రతను పక్కన పెట్టి వికృత రాజకీయాలు చేస్తోందెవరు? మన దేశంలోని కొన్ని పార్టీలు తమకు తెలియకుండానే…శత్రు దేశపు కుట్రలో భాగస్వాములుగా మారిపోతున్నాయా?
గెలిచిన పార్టీ సంబరాలు జరుపుకోవడం.. ఓడిన పార్టీ డీలా పడిపోవడం ఏ దేశంలోనైనా మామూలు విషయమే కానీ.. మన దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు సంతోషాన్ని కలిగించాయట. బీజేపీ ఓడిపోవడం.. కాంగ్రెస్ పార్టీ గెలవడంతో భారత్ లో తమకు అనుకూల సంకేతాలు వెలువడుతున్నాయని ఆ దేశ మీడియా చర్చలు చేసింది.
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుతో పాకిస్తాన్ లో సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ గెలుపుతో ఇక తమ దేశానికి మంచి రోజులు వచ్చినట్టేనని.. రాహుల్ ప్రధాని అయితే, పాకిస్తాన్ కి మేలు జరుగుతుందని పాక్ మీడియాలో చర్చలు చేపట్టారు. మోడీని దూషిస్తూ.. రాహుల్ ను పొగుడుతూ కొన్ని ఛానెళ్లు స్టోరీలు నడిపాయి. అంతేకాదు, రాజస్థాన్ లో జరిగిన కాంగ్రెస్ విజయోత్సవాల్లో కూడా పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో పాటు, ఆ దేశానికి చెందిన జెండాలు ఎగిరాయి. అయినా, ఒక్క కాంగ్రెస్ నేత కూడా దీనిపై స్పందించలేదు.
ఇంతకీ భారత్ లో కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ లో ఎందుకు సంబరాలు జరుపుకుటోంది..? కాంగ్రెస్ గెలుపుతో తమకు మంచిరోజులు రాబోతున్నాయని పాకిస్తాన్ భావిస్తోందా..? రాహుల్ అంటే ఆ దేశానికి ఎందుకంత ఇష్టం..? కాంగ్రెస్ గెలుపు కోసం ఉగ్రవాద దేశం కృషి చేస్తోందా..? అనే అనుమానాలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, సిద్ధూ,శశిథరూర్ తరచూ పాకిస్తాన్ టూర్లకు వెళ్తుండటంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్ హై కమిషనర్ తో టచ్ లో వున్నట్టు కూడా అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. దీంతో అసలు పాకిస్తాన్ తో కాంగ్రెస్ పార్టీ దోస్తానా ఏంటి అని జాతీయవాదులు మండిపడుతున్నారు.
ఒక్క పాకిస్తాన్ తోనే కాదు, కాంగ్రెస్ నేతలు చైనాతోనూ తరుచూ టచ్ లో వుంటున్నారు. గతంలో డోక్లాం ఉద్రిక్తతల సమయంలో చైనా రాయబారితో రాహుల్ గాంధీ రహస్యంగా మంతనాలు జరపడం.. తీవ్ర కలవరం రేపింది. అంటే, 2019 ఎన్నికల్లో చైనా, పాకిస్తాన్ అండతో మోడీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇదంతా ఒకెత్తయితే, జాతి వ్యతిరేక శక్తులు మనగడ్డపైనే రెచ్చిపోవడం కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగువేసిన సందర్భంలో ఓ ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈ సందర్భంలో గులాబీ జెండాలతో పాటు.. ఎంఐఎం జెండాలు పట్టుకున్న పలువురు.. ఆయన ఇంటిపై రాళ్లు విసరడం కలకలం సృష్టించింది.
గెలుపు తర్వాత సంబరాలు జరుపుకోవడంలో తప్పులేదు. కానీ, ఓడిన అభ్యర్థి ఇంటిపై రాళ్లు విసరడం, పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేసే కొంతమంది కుర్రకారు మన మధ్యలో వుండటం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాకిస్తాన్ జిందాబాద్ అనేవాడు ఎవ్వడైనా సరే ఈ దేశానికి అనర్హుడే. కచ్చితంగా వాడి మైండ్ సెట్ నైనా మార్చాలి లేదంటే వాళ్లనన్నా మార్చాలి. దాని వెనుకాల వున్నటువంటి సూత్రాధారులను కంట్రోల్ చేయాలి. ఇలాంటి ఘటనలను అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. లేదంటే ఈ వ్యవహారాలు భవిష్యత్తులో దేశ భద్రతకు ప్రమాదంగా పరిణమించే అవకాశం వుంది.
Source: Bharath Today.
https://www.bhaarattoday.com/news/national/story/29779.html





