
461views
కెనడా: భారత సంతతికి చెందిన వారికి కెనడా ప్రభుత్వం మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ముఖ్య బాధ్యతలను నిర్వహించనున్నారు. మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. ఆమెను నూతన రక్షణ మంత్రిగా నియమించారు. 54 ఏళ్ల అనితా ఆనంద్.. కెనడా రక్షణ మంత్రిగా ఉన్న భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.





