News

తైవాన్‌పై దాడిచేస్తే తొక్క తీస్తాం!

713views
  • చైనాకు అమెరికా హెచ్చరిక

వాషింగ్టన్‌: చైనా ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం ఎంతకైనా తెగిస్తుంది. భారత్‌ లాంటి బలమైన దేశాలు చైనాకు దీటుగా బదులిస్తూ ఉండగా.. తైవాన్‌ వంటి చిన్న దేశాలు ప్రపంచ దేశాల సాయం కోసం నిరీక్షిస్తున్నాయి. తాజాగా చైనాను అమెరికా హెచ్చరించింది. తైవాన్‌పై చైనా దాడి చేస్తే, తైవాన్‌కు అండగా పోరాడుతామని అమెరికా అధ్యక్షుడ బైడెన్‌ అన్నారు.

తైవాన్‌ను రక్షిస్తామని.. ఆ విషయానికి కట్టుబడి ఉన్నట్టు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. తైవాన్‌ అంశంలో తమ ప్రభుత్వ విధానంలో ఎటువంటి మార్పులేదని వైట్‌హౌజ్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. తైవాన్‌తో అమెరికాకు నేరుగా దౌత్యపరమైన సంబంధాలు లేవు. కానీ ఆ దేశానికి ఆయుధాలను అమెరికా అమ్ముతోంది. బైడెన్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా తైవాన్‌ స్పందించింది. చైనా అంశంలో తమ విధానం ఏమీ మారదని, ఒకవేళ డ్రాగన్‌ దేశం దాడి చేస్తే, తామే ప్రతిదాడి చేస్తామని తైవాన్‌ చెప్పింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి