GalleryNewsProgramms

విజయవాడలో సేవాభారతి నూతన కార్యాలయ గృహప్రవేశం

1.1kviews

విజయవాడలోని ఎల్. ఐ. సి కాలనీలో నూతనంగా నిర్మించిన సేవా భారతి కార్యాలయ గృహప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 14 -10- 2021 గురువారం నాడు జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణీ సభ్యులు శ్రీ భాగయ్య ముఖ్య వక్తగా విచ్చేశారు. శ్రీ గమిని శ్రీనివాస నవీన్  ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీమతి డాక్టర్ చదలవాడ సుధ, శ్రీ నాగేశ్వర రావు దంపతులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. సేవా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సాయి కిశోర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా Covid 19 సందర్భంగా సేవాభారతి నిర్వహించిన, నిర్వహిస్తున్న పలు సేవాకార్యక్రమాలను వివరించే బ్రోచర్ ను పెద్దలు విడుదల చేశారు. అనంతరం స్థల దాతలు డాక్టర్ చదలవాడ సుధ, నాగేశ్వరరావు దంపతులను, భవన నిర్మాణానికి సహకరించిన శ్రీ వీరమాచనేని రంగ ప్రసాద్, శ్రీమతి రమణి కుమారి దంపతులను శ్రీభాగయ్య సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాతలు, కార్యకర్తల కుటుంబాలు పాల్గొన్నారు. ఆ కార్యక్రమ దృశ్యాలను ఓసారి పరికిద్దాం………

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.