News

భారత ఆర్మీలో చేరిన 259 మంది జమ్మూకాశ్మీర్ యువకులు..!

635views

కాశ్మీర్ యువత భారత్ కు వ్యతిరేకమని.. వారంతా పాకిస్థాన్ లో కలవాలని కోరుకుంటున్నారని ఇప్పటికే ఎంతో మంది పాక్ నేతలు భారత్ మీద బురదజల్లేలా మాట్లాడారు. కానీ వారందరి నోళ్లు మూయించేలా ప్రవర్తించారు కాశ్మీర్ యువత. భారత ఆర్మీలో జాయిన్ అవ్వడానికి కొద్ది రోజుల క్రితం ఎంతోమంది యువకులు హాజరు అయ్యారు. వారిలో నుండి సెలెక్ట్ చేసిన 259 మంది యువకులకు ఆర్మీలో చేర్చుకున్నారు. భారతదేశం కోసం పోరాడేందుకు తాము సిద్ధం అని చెబుతూ 259 మంది జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాన్ట్రీ బెటాలియన్ లోకి వారు చేరారు. శ్రీనగర్ లోని రెజిమెంటల్ సెంటర్ లో దాదాపు ఒక సంవత్సరం పాటు వారు శిక్షణ తీసుకున్నారు. వారిని భారత ఆర్మీలో చేర్చుకునే సమయంలో జరిగిన ఈవెంట్ కు వారి కుటుంబసభ్యులు బంధువులు హాజరు అయ్యారు.

Source: Bharath Today