News

రామ మందిర నిర్మాణం కోసం నేడు భారీ ర్యాలీ…రాంలీలా మైదానంలో భారీ సభ

92views

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ తన పోరాటాన్నితీవ్రత‌రం చేసింది. ఆలయ నిర్మాణం కోసం బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహించనుంది. మరోవైపు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే నమ్మకం తమకుందని ఆరెస్సెస్ పేర్కొంది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈరోజు జరగనున్న భారీ సభలో ఆరెస్సెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భయ్యాజీ జోషీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఆయనతో పాటు వీహెచ్పీ అధ్యక్షుడు సదాశివ్ కోక్జే, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ లు కూడా ప్రసంగించనున్నారు.

Source: Bharath today.